ప్రిన్స్ తో రాజమౌళి చిత్రం

వరుసగా ఏడు హిట్ చిత్రాలను అదించిన స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి 'మగధీర' చిత్రం తర్వాత ఏ హీరోకి పనిచేయబోతున్నారనే సస్పెన్స్ ఇంకా తెరపడలేదు. అయితే 'మగధీర' కంటే ముందుగానే ఆయన కమెడియన్ సునీల్ కథానాయకుడుగా 'మర్యాద రామన్న' చిత్రానికి కమిట్ అయినందున ఆ చిత్రం తొలుత సెట్స్ పైకి వస్తుంది. ఈనెల 21 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీని తర్వాత తన గురువైన దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు బ్యానర్ లో ఓ చిత్రానికి పనిచేస్తారనే ప్రచారం కూడా ఉంది. తాజా సమచారం ప్రకారం ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ హెవీ బడ్జెట్ చిత్రానికి పనిచేసేందుకు రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్టు సమాచారం.

దిల్ రాజు ప్రస్తుతం వరుణ్ సందేష్ తో 'మరోచరిత్ర' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రోగ్రస్ లో ఉంది. ఈ డిసెంబర్ నుంచే ఎన్టీఆర్ కథానాయకుడుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న 'బృందావనం' సెట్స్ పైకి రాబోతోంది. దీనిని 30 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు చిత్రాన్ని కూడా దిల్ రాజు ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో 50 కోట్ల హెవీ బడ్జెట్ తో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా దిల్ రాజు ప్రకటించన్నారు.

Comments

0 Response to 'Raja Mouli Next Film with Prince Mahesh Babu!!'

Post a Comment

Newer Post Older Post Home i am everywhere except homepage