NTR's "Adurs" New Movie on Sets!!

By sy on 8:39:00 PM
ఎన్టీఆర్ 'అదుర్స్'


ఎన్టీఆర్ కథానాయకుడుగా వైష్ణవి ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి 'అదుర్స్' అనే టైటిల్ ఖరారైంది. వైష్ణవీ ఆర్ట్స్ పతాకపై కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్ తో 'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత హ్యాట్రిక్ ఫిల్మ్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పలు టైటిల్స్ పరిశీలనకు వచ్చినప్పటికీ మొదట్నించీ 'అదుర్స్' టైటిల్ జనాలకు చేరువైంది. దీనిని దృష్టిలో ఉంచుకునే దర్శక నిర్మాతలు ఆ టైటిల్ నే ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా కథానాయికలుగా నటిస్తున్నారు.




కొద్దిపాటి బ్యాలెన్స్ వర్క్ మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈనెల 9 నుంచి హైద్రాబాద్ లో ఓ పబ్ సెట్ వేసి ఓ గీతాన్ని చిత్రీకరించనున్నారు. ఈ నెల మూడో వారంలో ఆడియో విడుదల చేసి డిసెంబర్ 18న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Comments

0 Response to 'NTR's "Adurs" New Movie on Sets!!'

Post a Comment

Newer Post Older Post Home i am everywhere except homepage