హిందీ 'కిక్'లో కల్యాణ్ రామ్

నందమూరి అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం వారసుడుగా ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్న కల్యాణ్ రామ్ ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం...రవితేజ కథానాయకుడుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గత సమ్మర్ కు తెలుగులో విడుదలై విజయవంతమైన 'కిక్' చిత్రం హిందీ రీమేక్ లో కల్యాణ్ రామ్ నటించనున్నట్టు తెలిసింది.

'కిక్' హిందీ రీమేక్ రైట్స్ ను కోటి రూపాయలు చెల్లించి ప్రముఖ నిర్మాత సాజిద్ నడియడ్ వాలా సొంతం చేసుకున్నారు. దీనికి కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా ఇప్పటికే సల్మాన్ ఖాన్, అమృతారావు (తెలుగు 'అతిథి' ఫేమ్) ఎంపికయ్యారు. ఇందులో హీరోతో సమానమైన పోలీస్ ఆఫీసర్ పాత్రను కల్యాణ్ రామ్ పోషించబోతున్నట్టు తెలుస్తోంది. ఒరిజనల్ వెర్షన్ లో ఆ పాత్రను తమిళ హీరో శ్యామ్ పోషించారు. ఇప్పుడు ఆయన 'కిక్' శ్యామ్ గా పాపులర్ అయ్యారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి తీసిన 'అతనకొక్కడే' చిత్రం ద్వారానే సురేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ చిత్రం ఇటు కల్యాణ్ రామ్ కెరీర్ కూ, సురేందర్ రెడ్డికి మంచి బ్రేక్ ఇచ్చింది. దర్శకుడిగా తనకు తొలి అవకాశమిచ్చిన కల్యాణ్ రామ్ ను ఇప్పుడు బాలీవుడ్ కు పరిచయం చేయడం ద్వారా కృతజ్ఞతను చాటుకోవాలని సురేందర్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది.


Comments

0 Response to 'Kalyan Ram Acting in "Kick" 'Hindi Version!!'

Post a Comment

Newer Post Older Post Home i am everywhere except homepage